చంద్రపురి కాలనీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం
విశ్వంభర, ఎల్‌బీ నగర్: ఎల్‌బీ నగర్‌లోని చంద్రపురి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎల్‌బీ నగర్ జోన్ జనరల్ మేనేజర్ గారికి కాలనీ అధ్యక్షుడు సోమీ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. కాలనీలోని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో పెద్ద మొత్తంలో సిల్ట్ పేరుకుపోవడంతో పాటు, అనేక మ్యాన్‌హోల్స్ దెబ్బతిని, మూతలు కూడా విరిగిపోయాయని వివరించారు. దీంతో ప్రతిరోజూ మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ దుర్వాసన వెదజల్లడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లు కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. అందువల్ల కాలనీలోని అన్ని మ్యాన్‌హోల్స్‌లో పేరుకుపోయిన సిల్ట్‌ను వెంటనే తొలగించి, దెబ్బతిన్న మ్యాన్‌హోల్స్‌ను మరమ్మతు చేసి, విరిగిన మూతలను మార్చి డ్రైనేజీ నీరు సజావుగా ప్రవహించేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులు సమస్యను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రపురి సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.