అనంతారం లో బీజేపీ బూత్ కమిటీల పునర్ వ్యవస్తీకరణ
విశ్వంభర, గుండాల: గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్లు 238, 239 పరిధిలో సమావేశాలు నిర్వహించి, బూత్ కమిటీలను పునర్వ్యవస్థీకరించి నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ తుమ్మల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, అనంతరం గ్రామానికి వచ్చే అభివృద్ధి నిధుల్లో అధిక భాగం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన, అవినీతి రహిత, ప్రజా సంక్షేమ పాలనను అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతారం బీఎల్‌వోలు బీఎల్‌ఏ-2లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చడం, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. తదుపరి గుండాల గ్రామంలో బీజేపీ కార్యకర్త శ్రీ మహేష్ గారి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొని, కార్యకర్తలతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి, మండల ఇంచార్జ్ గుజ్జ సోమనర్సయ్య, మండల అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ తోటకూరి శ్రీకాంత్, సీనియర్ నాయకులు కొఠారి రుద్రయ్య, బూత్ అధ్యక్షుడు ఇట్టబోయిన రమేష్, గుర్రం వెంకటరెడ్డి, జాంగీర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.