ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయమే
విశ్వంభర, కాచిగూడ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. హైదరాబాదు కాచిగూడ నుంచి బర్కత్‌పుర సిగ్నల్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. నీట్, సీయూఈటీ పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ వైఫల్యాలు, విద్య కేంద్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి ఉద్యమ ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదని, ఎన్‌టీఏను రద్దు చేసి రాష్ట్రాలకే ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలని, జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సభకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. అశోక్ రెడ్డి అధ్యక్షత వహించగా, టి. నాగరాజు, పుట్టా లక్ష్మణ్, మణికంఠ రెడ్డి, ఎస్. అనిల్, పి. మహేష్, నితీష్ ప్రసంగించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.డి. జావేద్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో లెనిన్, జూనుగరి రమేష్, నాగేంద్ర, కైలాష్, గ్యార నరేష్, అనిల్, హరీష్, నాగరాజు, శ్రీను, అశ్విని తదితరులు పాల్గొన్నారు.