కుల వివక్ష నిర్మూలనకు ఉద్యమం అవసరం: మంద కృష్ణ మాదిగ

విశ్వంభర, రాంనగర్‌ : కుల వివక్ష, పేదరిక నిర్మూలనతో పాటు మాదిగల ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాదు రాంనగర్‌లోని బీఆర్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల హైదరాబాదు జిల్లా కార్యవర్గ సమావేశం ఇంజి. వెంకట్ స్వామి మాదిగ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన దీర్ఘకాల పోరాటం ఫలితంగా మాదిగ యువతకు విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెరిగాయని చెప్పారు. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరుగుతున్నాయని, కుల వివక్ష నిర్మూలనతో పాటు అన్ని వర్గాలకు దేశ సంపదలో సమాన భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాదిగలు విద్య, ఉద్యోగాలతో పాటు ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ ఎదగాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు నేటి నుంచి 40 రోజుల పాటు గ్రామాలు, బస్తీల స్థాయిలో విద్యార్థులు, యువతతో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవింద్ నరేష్ మాదిగ, చిలక ఎల్లయ్య మాదిగ, గండి కృష్ణ మాదిగ, ఎడవల్లి యాదయ్య మాదిగ, టీవీ నరసింహ మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, మునిరాజు అరుణ్ కుమార్ మాదిగ, మాచర్ల ప్రభాకర్ మాదిగ,డపల్లి శివ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/manda-krishna-madiga-needs-a-movement-to-eliminate-caste-discrimination/article-19982

Tags: