మహేష్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- 8 మంది నిందితుల్లో ఏడుగురు అరెస్ట్.. ఒకరు పరారీలో
విశ్వంభర, హనుమకొండ: ఎనుమాములలో అడుప మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసును గీసుగొండ పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పత్తి కుమారస్వామి అలియాస్ కుమార్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించగా, వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. మరో నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. పాత కక్షలు, రాజకీయంగా తనకు ప్రాధాన్యత దెబ్బతీస్తున్నాడనే అనుమానంతో నిందితులు ఈ నెల 18వ తేదీ రాత్రి పరిమళ కాలనీ రోడ్డు నంబర్-2 వద్ద మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన మహేష్ చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీ రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 237/2026గా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 61, 103(1), 308(4), 249 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని సేకరించి నిందితులను అరెస్ట్ చేశాయి. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అరెస్టైన నిందితుల్లో పత్తి కుమారస్వామి అలియాస్ కుమార్ (ప్రధాన నిందితుడు), గంధం నరేష్, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్ అలియాస్ బండి శ్రీను, లాసాని రాంసాయి, టోని సంజయ్య, పోతారం శివకుమార్ ఉన్నారు. మరో నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ వెంకట్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్‌తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అభినందించారు