మహేశ్వరంలో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
- గ్రామాభివృద్ధే ధ్యేయం : సర్పంచ్ మునగపాటి నవీన్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారంగా ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ, గ్రామంలో పెరుగుతున్న జనాభా, కొత్త కాలనీల విస్తరణతో విద్యుత్ వినియోగం అధికమై లో వోల్టేజ్ సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. దీంతో టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరంతరం సమన్వయం చేయడంతో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు సాధ్యమైందన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తో సంబంధిత ప్రాంతాల్లో విద్యుత్ వోల్టేజ్ మెరుగుపడి, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడంతో గృహ వినియోగదారులు, రైతులు, చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జొరల రమేశ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి సుజాత, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.