మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం రామన్నపేట మండల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.ఏ.డబ్లు.యు) నాయకులు సందర్శించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రామన్నపేట మండల అధ్యక్షులు మేడి ముకుందం మాట్లాడుతూ, వైద్య సేవలను, ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను స్థానిక ప్రజల నుంచి తెలుసుకొని, తాగునీరు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది కొరత వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, గీత కార్మిక సంఘం నాయకులు తలుపునూరి జితేందర్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ, ఐద్వా సంఘం మండల కార్యదర్శి జంపాల అండాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/leaders-of-the-agricultural-labor-union-who-inspected-the-municipal/article-18636

Tags: