జెడ్ పి హెచ్ ఎస్ కు బ్లాక్ బోర్డులు వితరణ

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు అదే గ్రామానికి చెందిన బొబ్బిలి మహేందర్ రెడ్డి, గంజి జనార్దన్ రెడ్డి(క్వారీ) సంయుక్తంగా మూడు బ్లాక్ బోర్డులను వితరణ చేశారు. స్కూల్ టీచర్స్ అభ్యర్థన మేరకు సుమారు రూ.12 వేల విలువగల బోర్డులను సోమవారం పాఠశాల ఇన్చార్జి హెచ్.ఎం.అమ్మ యాకయ్య తోపాటు ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం మహేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి లను అభినందిస్తూ శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఎం అమ్మ యాకయ్య మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని, సహాయం అందించడానికి దాతలు ముందుకు వస్తేనే ప్రభుత్వ బడులు అభివృద్ధిలో, విద్యార్థుల నమోదులో మరింత పురోగతి సాధించి బలోపేతమవుతాయన్నారు. కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు తాళ్ల ప్రణయ్,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ప్రవీణ్,యాదగిరి,దేవేందర్,కిషన్, సంపత్,అమీనా కౌసర్,ఉప్పలయ్య,ఇస్మాయిల్,పాష తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-black-boards-to-z-phs/article-20024

Tags: