త్తాత్రేయ స్వామిని దర్శించుకున్న టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
విశ్వంభర, సంగారెడ్డి : హత్నూర సమీపంలోని పురాతన దత్తలయ్య గుట్టలో వెలసిన దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ సభాపతి శర్మ ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ, 650 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పానుగంటి కృష్ణ, శివన్న జైన్, వెన్న చక్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.