నాగర్‌గూడ విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

విశ్వంభర, షాబాద్: షాబాద్ మండలంలోని నాగర్‌గూడ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో "మహేందర్ అన్న విద్యకానుక" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎంఈఓ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు, షూస్, టై, బెల్ట్, స్కూల్ యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ స్వరూప మహేందర్ గౌడ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు బండ కిట్టు గౌడ్, ఉప సర్పంచ్ వేణుగోపాల్, వార్డు సభ్యులు ఆఫ్సర్, మహిపాల్, క్రాంతి కుమార్, ఈదుల కృష్ణ గౌడ్, గ్రామ పెద్దలు రావుల లింగయ్య, రావుల పరమేష్, టేకులపల్లి సత్తయ్య, ఆబేద్, ముక్తార్, అలాగే గ్రామ యువత, మహిళలు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-educational-materials-to-nagarguda-students/article-20022

Tags: