డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిలో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష
- పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మంది లో ఇద్దరికి 2 రోజులు జైలు శిక్ష, జరిమానా, ఒకరికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్, మరో ఎనిమిది మంది కి జరిమానా సూర్యాపేట కోర్టు విధించినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై యాదవేందర్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందిని ఈరోజు కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష మరియు రూ. 2,000 జరిమానా, ఒక్కరికి ఒక్కరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ మరియు మరో ఎనిమిది మందికి రూ.7,900 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ, ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు పోలీసులు చేసే వాహన తనిఖీలు ప్రజల ప్రాణరక్షణ కోసమే అని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.