బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా అభినయ్ గౌడ్‌

విశ్వంభర, చేవెళ్ల : భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అభినయ్ గౌడ్‌ను చేవెళ్లలో బీజేవైఎం నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ, అభినయ్ గౌడ్ నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో బీజేవైఎంను మరింత బలోపేతం చేసి, యువత సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు. యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/abhinay-goud-as-bjym-rangareddy-district-president/article-20010

Tags: