కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి: బీఎంఎస్
విశ్వంభర, జార్ఖండ్ : దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది. జార్ఖండ్‌లోని రాంచీలో జరుగుతున్న బీఎంఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానం ఆమోదించింది. వేతనాలను కాలానుగుణంగా సవరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సమావేశం కోరింది. అలాగే ఈఎస్‌ఐ పరిధిని విస్తరించి మరింత మంది కార్మికులకు వైద్య భద్రత కల్పించాలని, ఈపీఎస్–95 కింద కనీస పెన్షన్‌ను ₹7,500కు పెంచి కరవు భత్యం చెల్లించాలని తీర్మానించింది. అసంఘటిత రంగ కార్మికులకు కూడా సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమాన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించాలని సమావేశం పేర్కొంది. ఈ తీర్మానాలు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక భద్రతను బలోపేతం చేయడం, ఉద్యోగ భద్రతను కల్పించడం లక్ష్యంగా రూపొందించినవని బీఎంఎస్ అఖిల భారత కార్యవర్గం తెలిపింది. కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ఈ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జాతీయ నాయకులు మల్లేశం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.