నెల్లికుదురులో విత్తనమేళా  ప్రారంభం

నెల్లికుదురులో విత్తనమేళా  ప్రారంభం

విశ్వంభర, నెల్లికుదురు:  ఎల్ నినో మూలంగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటల కోసం రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి మూడు రోజులపాటు విత్తనమేల నిర్వహిస్తోంది. ఈ మేరకు మండల కేంద్రం నెల్లికుదురులోని రైతు వేదికలో స్థానిక ఉపసర్పంచి మంచాల వెంకన్న విత్తనమేళాను సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. మండల ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి,ఏఈవోలు సుమలత, మణికంఠ, ప్రతిభ, ధరనీష్ లు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన పెసర,కంది,మినుము విత్తన సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక్కో సంచి 4 కిలోలు ఉంటుందని, సబ్సిడీపై ఒక సంచికి రూ.450 లభిస్తుందన్నారు. పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకు వచ్చి విత్తనాలు పొందవచ్చని సూచించారు. బాగా ప్రైవేటు సంస్థలకు చెందిన మొక్కజొన్న, కూరగాయ విత్తనాలు సైతం విత్తనమేళాలో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు.కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫిట్ ఫీల్డ్ ఆఫీసర్ నర్మద, ఫెర్టిలైజర్స్ డీలర్సు రైతులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/seed-mela-begins-in-nellikuduru/article-20033

Tags: