కలాం ఆశయాలు విద్యార్థులకు ఆదర్శం

కలాం ఆశయాలు విద్యార్థులకు ఆదర్శం

విశ్వంభర, కేసముద్రం: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పేరుగాంచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా సోమవారం శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డాక్టర్ అబ్దుల్ కలాం నిరాడంబర జీవితం, దేశాభివృద్ధి కోసం చేసిన సేవలు, యువతపై ఉంచిన విశ్వాసం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని కలాం సందేశాన్ని గుర్తు చేశారు. కలలు కనడం మాత్రమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని ఆయన సూచించిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కలాం జీవిత విశేషాలను, శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసిన విశేష కృషిని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కలాం సూక్తులను చదివి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kalam-ambitions-are-ideal-for-students/article-20018

Tags: