అంతర్ జిల్లా వాహనాల దొంగ అరెస్ట్
- రూ.4.15 లక్షల విలువైన 10 బైక్‌లు స్వాధీనం
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల 15 వేల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించడంతో అతని వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. వాహనాల యజమానులు తాళాలు తీసివేయకుండా, భద్రతా చర్యలు పాటించాలని ఆయన సూచించారు.