జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
- వలిగొండ మండల సమీక్ష సమావేశంలో ప్రత్యేక అధికారి జగన్నాథ్
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి జగన్నాథ్ అధ్యక్షతన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీఓ జి. జలంధర్ రెడ్డి, ఎంపీఓ వై. ప్రేమలతతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గ్రామ పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ మిషన్ పనులు, ఫార్మ్ పాండ్లు, సోక్‌పిట్లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వనమహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి జగన్నాథ్ సూచించారు.