ఇండ్లలోకి మురుగు నీరు - పట్టించుకోని అధికారులు
గత పది సం.రాలుగా కాలనీలో పలు సమస్యలు
On
విశ్వంభర, బడంగ్ పేట్ :- మున్సిపల్ పరిధిలోని తిరుమల నగర్, రోడ్ నెం.2లో కాలనీ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గత పది సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న స్థానికులకు కాలనీ లో పలు సమస్యలు చుట్టుముట్టడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో పై భాగాన ఉన్న ఇళ్ల నుండి కింది భాగాన ఉన్న నివాసితులకు ఇబ్బందికరంగా మారిపోయింది. అలాగే కాలనీ పై భాగంలో ఉన్న నివాసితులు ఇంటి ముందర నీటితో కడగడం , నీళ్లను వృధా చేయడంతో దిగువ ఉన్న ఇండ్ల ముందు నీరు చేరి చెరువులను తలపయిస్తున్నాయి. ఇక వర్షాకాలం వస్తే అంతే సంగతులు అని వరద నీరు అంత కింది భాగాన జామ్ అవ్వడంతో అక్కడ ఉన్న ఇండ్లలోకి మురుగు నీరు చేరడంతో పాటు పాములు , తేళ్లు వస్తున్నాయని భయబ్రాంతులకు గురవుతున్నామని అన్నారు. పలుమార్లు అధికారులకు , ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోని పాపాన పోలేదని వాపోయారు. విసుగు చెందిన కాలనీకి సంబందించిన ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంటి ముందు నీరు నిల్వ చేరడంతో 20 ఫీట్ల రోడ్డుకు అడ్డంగా రెండు అడుగుల మేర మట్టిని పోయడంతో సమస్య మరింత పెరగడంతో కాలనీ కమిటీ సభ్యులు సలహాతో అధికారులకు , ప్రజాప్రతినిధులకు సమస్యలను తెలిపేందుకు మీడియాను ఆశ్రయించారు. అలాగే మరోమారు ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేసి, సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున కాలనీవాసులమంతా జిహెచ్ఎంసి కార్యాలయంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/6a685316b40c6/article-19999