గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్ 

విశ్వంభర,  రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారుతో పోలీస్ కమిషనర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను చట్టబద్ధంగా,పారదర్శకంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు,సీఐలతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని,వాటి సత్వర పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేదా పైరవీలు లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని,వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువై, శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, పారదర్శకమైన సేవలను అందించడమే రామగుండం పోలీస్ కమిషనరేట్ లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించి,వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/commissioner-of-police-who-receives-complaints-on-grievance-day/article-19995

Tags: