ప్రతి నీటి బొట్టును సంరక్షించడంతోనే భావితరాలకు భద్రత 

  • :  మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

విశ్వంభర, సూర్యాపేట: వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై యువతలో అవగాహన పెంపొందించడం ద్వారానే జల భద్రత సాధ్యమవుతుందని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి లు అన్నారు. జాతీయ జల మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్–2025–26 కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "క్యాచ్ ది రైన్ – వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్" అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక రాయన్‌గూడెంలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నివేదిత లక్షాది,హన్మంత రెడ్డి లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నీటి సంరక్షణ అవసరాన్ని వివరించారు. వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో, ప్రతి విద్యాసంస్థలో, ప్రతి కార్యాలయంలో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం కాలానుగుణ అవసరమని తెలిపారు.విద్యార్థుల్లో నీటి సంరక్షణపై చైతన్యం పెంపొందించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని వారు పేర్కొన్నారు. నీటి వృథాను నివారించడం, వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు.ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో జాతీయ జల మిషన్ "జల ప్రతిజ్ఞ" చేయించి, నీటి వనరుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన నీటి సంరక్షణ అంశాలపై పోస్టర్లు, వ్యాసాలు, అవగాహన కల్పించే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను పరిశీలించిన ముఖ్య అతిథులు వారి సృజనాత్మకతను అభినందించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసి సత్కరించారు.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. ఆడెపు రమేష్ అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపల్ డా. జి. నీలమ్మ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. నవీన్ కుమార్, చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శివప్రసాద్, వార్డు అధికారి నరేష్, అధ్యాపకులు, మున్సిపల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో "ప్రతి చుక్కను కాపాడితేనే రేపటి తరాలకు నీటి భద్రత సాధ్యం" అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/protecting-every-drop-of-water-is-the-safety-of-future/article-20012

Tags: