అభివృద్ధి పేరుతో పేదలను బలి చేయొద్దు
- బాధితులకు పునరావాసం, నష్టపరిహారం కల్పించాలి...
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు ప్రతిపాదించిన 70 అడుగుల రోడ్డు నిర్మాణం పేద, మధ్యతరగతి కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. రోడ్డు విస్తరణతో ఇరువైపులా ఉన్న గృహాలు, దుకాణాలు, ఖాళీ స్థలాలు కోల్పోతున్నామని బాధితులు కన్నీటి పర్యంతమై తమ గోడును వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా బాధితులు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీకి చెందిన స్థానిక నాయకులు బాధితుల వద్దకు చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం బాధితులు, అఖిలపక్ష నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్, పాలకవర్గ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణ అభివృద్ధిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించడం లేదన్నారు. అయితే అభివృద్ధి పేరుతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ప్రజల కన్నీళ్లపై అభివృద్ధి నిర్మించకూడదని, ప్రజలకు నష్టం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టే మార్గాలను అన్వేషించాలని కోరారు. ఈ రోడ్డు విస్తరణ కారణంగా కొందరు పూర్తిగా ఇళ్లను కోల్పోతుండగా, మరికొందరు సగం ఇళ్లు, దుకాణాలు, ప్లాట్లు కోల్పోతున్నారని పేర్కొన్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు కేవలం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించడం కాకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోనే ఇంటి స్థలం కేటాయించి గృహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పాక్షికంగా ఇళ్లు, దుకాణాలు, స్థలాలు కోల్పోతున్న వారికి మార్కెట్ విలువకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి రామవరం వైపు వెళ్లే ఈ రహదారి భారీ ట్రాఫిక్ ఉండే ప్రధాన రవాణా మార్గం కాదని, ప్రస్తుతం ఉన్న వెడల్పుతో పాటు అవసరమైన మేరకు 50 అడుగుల రోడ్డును, ఇరువైపులా 5 అడుగుల మోరీతో నిర్మించినా ప్రజల అవసరాలు తీరతాయని బాధితులు సూచించారు. అయినప్పటికీ తమ ఇళ్లు, స్థలాలు కోల్పోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బాధితులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు వినాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలతో ముడిపడిన ఈ అంశాన్ని మానవీయ కోణంలో పరిశీలించి, పేదలకు న్యాయం జరిగేలా తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాధితుల వినతిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్, పాలకవర్గ సభ్యులు సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని, బాధితుల అభ్యర్థనలు, పునరావాసం, నష్టపరిహారం అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రహదారి ఇరువైపులా నివసిస్తున్న బాధిత కుటుంబాలు, దుకాణదారులు, ప్లాటు యజమానులు, బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ నాయకులు, తదితరులున్నారు.