గుర్తుతెలియని వాహనం ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం
విశ్వంభర, అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం-కోదాడ హైవేపై శాంతినగర్ గ్రామ పరిధిలో గొర్రెలు కాస్తుండగా ఒక గుర్తుతెలియని వాహనం గొర్రెల కాపరిని బలంగా ఢీకొట్టి, ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో శాంతినగర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గోపిదేశి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు వెంటనే స్పందించి తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించి మరణించారు.ప్ర మాదం జరిగిన వెంటనే స్పందించిన అనంతగిరి పోలీసులు హైవేపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని రాంపురం క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు.