మెగా రైతు మేళాలో రైతు మిత్ర అగ్రి షో 2026 

మెగా రైతు మేళాలో రైతు మిత్ర అగ్రి షో 2026 

విశ్వంభర, హానుమకొండ :-ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో జరిగిన మెగా రైతు మేళాలో రైతు మిత్ర అగ్రి షో నిర్వాహకులు డాక్టర్ గౌతమ్ రెడ్డి, విజయ్ కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూజూన్ 12, 13 & 14 తేదీలలో హైదరాబాద్‌లోని NTR స్టేడియంలో “రైతు మిత్ర అగ్రి షో 2026” ఘనంగా నిర్వహించబడుతుంది అని అన్నారు.దేశవ్యాప్తంగా 600+ స్టాల్స్ పాల్గొననున్న ఈ అగ్రి షోలో వ్యవసాయ యంత్రాలు, డైరీ, పౌల్ట్రీ, ఆక్వా కల్చర్, డ్రోన్ టెక్నాలజీ, ఇరిగేషన్ సిస్టమ్స్, సేంద్రియ వ్యవసాయం వంటి విభాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు.ఇంతకుముందు డా. గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర , ఢిల్లీలో విజయవంతంగా కిసాన్ మేళా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇప్పుడు అదే అనుభవంతో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఈ అగ్రి షోను నిర్వహించబడుతోంది అని తెలిపారు. రైతులు, వ్యవసాయ దారులు, వ్యాపారులు, యువత,  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.కార్యక్రమంలో డా. గౌతమ్ రెడ్డి,   విజయ్ కృష్ణ పాల్గొన్నారు

Tags: