2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి

2029 వరకు తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతూనే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

2029 వరకు నాదే పగ్గాలు.. నేనే రాజు.. నేనే మంత్రి
రాష్ట్రంలో వచ్చే పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని అన్నారు. తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అని, తనకు పోటీ ఎవరూ లేరని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు పగ్గాలు తన చేతిలోనే ఉంటాయని పేర్కొంటూ, ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

Read More దండు రాహుల్ గుప్త కు అభినందనలు - పూర్ణ చందర్ గుప్త 

ఫోన్ ట్యాపింగ్ - కేసీఆర్ జైలు ప్రస్తావన
ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని, దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. తాము ఫోన్లు ట్యాప్ చేయడం లేదని, ట్యాప్ చేసిన సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని సెటైర్ వేశారు. కక్ష సాధింపు లేదని, కేసీఆర్‌ను జైల్లో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

కాళేశ్వరం - కేటీఆర్‌పై ఈడీ ఎక్కడ?
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం బాధ్యతను నిపుణుల కమిటీకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఖండించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేసు అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని డాక్యుమెంట్లను సభలో పెడతామని ఆయన హెచ్చరించారు.