విజేతలకు బహుమతుల ప్రదానం

విజేతలకు బహుమతుల ప్రదానం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలో జరిగిన తెలంగాణా స్టేట్ లెవెల్ బాయ్స్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో ప్రధమ స్థానంలో జోగులాంబ గధ్వాల జట్టు నిలిచింది. 45వ తెలంగాణా స్టేట్ లెవెల్ సబ్-జూనియర్ బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ పోటీలలో ప్రధమ బహుమతి జోగులాంబ గధ్వాల జట్టు గెలుచుకోగా, ద్వితీయ బహుమతి వికారాబాద్ జట్టు గెలుచుకుంది, తృతీయ స్థానంలో యాదాద్రి జట్టు నిలిచింది. ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా గెలిచిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ లు ఇవ్వడం జరిగింది. ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ వరికుప్పల స్వామి, షూటింగ్ భల్ల్ విజేతలకు, తెలంగాణా స్టేట్ జనరల్ సెక్రటరీ సి.హెచ్ ఐలయ్య, యాదాద్రి జిల్లా అధ్యక్షులు మోత్కూరి యాదయ్య, సెక్రటరీ మోత్కూరి మానస, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపాల్ నిర్మల చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్ లు అందించడం జరిగింది. వివిధ జిల్లాల కోచ్ లు, చంద్రమౌళి, స్కూల్ పీడీ మణి, క్రీడాకారులు మాట్లాడుతూ, మంచి ఏర్పాట్లు చేసిన ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ కు తమ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, సింగనబోయిన జంగయ్య, ఈర్లపల్లి మల్లయ్య, గోళ్లేపల్లి యాదయ్య, ఈర్లపల్లి రమేష్, గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్, బోనగిరి సంజీవ, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, గోగికార్ రాజుకుమార్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ శ్రీకాంత్, గడ్డం సాయి, కాటపల్లి నరేష్, గొర్ల నవీన్, గర్ధాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: