నాంపల్లి గాంధీజీ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
-- ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు
- నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు
- మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలి....
విశ్వంభర, నాంపల్లి: గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని చాచా నెహ్రూ వ్యాఖ్యలను విద్యార్థులకు సూచించారు. మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులందరూ మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి ఎందరో మహానీయుల త్యాగాలను పిల్లలకు వివరించారు. ప్రపంచంలో ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందని అన్నారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థుల అలవర్చుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో, దేశ పురోగాభివృద్ధిలో బాలలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. బాలల దినోత్సవాన్ని పిల్లల హక్కులు, సంక్షేమం మరియు విద్యను ప్రోత్సహించడానికి అంకితం చేయబడిందని తెలిపారు. దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు. వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్లు కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సామల వెంకటేశ్వర్లు, చిలుకూరి రామేశ్వరి, డాన్స్ మాస్టర్ తరుణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



