సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
On
- మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, నల్లకుంట : నల్లకుంట ప్రాంతంలోని పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూరగాయల మార్కెట్ రోడ్డు పనులు ప్రారంభించాలని వినతి పత్రం సమర్పించారు. మార్కెట్ రోడ్డు పనులకు సంబంధించిన జలమండలి, ట్రాఫిక్ విభాగాల సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జలమండలి 17వ డివిజన్ జనరల్ మేనేజర్ శ్రీధర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కార్యక్రమంలో మోహన్ నాయుడు, రితీష్, శ్రీనివాసరావు, కిరణ్ కుమార్, వీరయ్య పాల్గొన్నారు.



