ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా 

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా 

విశ్వంభర, మొయినాబాద్: మొయినాబాద్ మండల కేంద్రంలోని బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలో 9, 10వ వార్డులలో అంతర్గత అండర్ డ్రైనేజ్ పనులను గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి,  వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ,  గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కార దిశగా ముందుకు వెళ్తామని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొంతం నాగేశ్వర్ రెడ్డి, రాయనోళ్ల ఉపేందర్ యాదవ్, బంధి అనిల్, కొండకల్ల రవి, దినేశ్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివశంకర్, కరోబర్ జగన్నాథ్ నాయకులు పి రాఘవరెడ్డి, కొండకల్ల మహేందర్, బిక్షపతి గౌడ్,కొండకల్ల శ్రీకాంత్, కావాలి కిరణ్, విజయ్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: