హుక్కా అమ్మకాలపై ఉక్కుపాదం 

హుక్కా అమ్మకాలపై ఉక్కుపాదం 

  • ఎస్పి నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: రూ.15 వేల విలువైన నిషేధిత హుక్కా ఫ్లేవర్ ప్యాకెట్లు, హుక్కా వేపర్ స్వాధీనం చేసుకొని,  వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై మూడు కేసు నమోదు చేసినట్లు ఎస్పి నరసింహ తెలిపారు.ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు ఆయన హెచ్చరించారు.  సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట పట్టణం మెయిన్ రోడ్ నందు గల ఆర్.వి ఫ్యాషన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణాలలో హుక్కా అమ్మకాలు నిర్వహిస్తున్నారు అనే సమాచారంపై పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించగా 15వేల రూపాయల విలువైన నిషేధిత హుక్కా ప్యాకెట్లు, హుక్కా వెపర్ లు దొరికాయని చెప్పారు. దీనికి సంభందించి ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగినది అన్నారు. నిషేధిత హుక్కా వెపర్ సేవించడం వల్ల క్యాన్సర్ సంభంద వ్యాధులు వస్తాయి, ప్రజల ఆరోగ్యాలను హరించే ఇలాంటి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి హెచ్చరించారు, దీనిని సేవించడం వల్ల ఆరోగ్యాలు నాశనం అవుతాయని అన్నారు.  యువత ఇలాంటి చెడు అలవాట్లకు లోనుకావొద్దు అని తెలిపారు. ఇలాంటి అమ్మకాలకు సంబంధించిన సమాచారం పోలీసు వారికి తెలియజేయాలని కోరారు.

Tags: