స్వర్గపురి రథం ప్రారంభించిన సర్పంచ్ 

స్వర్గపురి రథం ప్రారంభించిన సర్పంచ్ 

విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఈర్లపల్లి (శివగల్ల) నర్సింహ జ్ఞాపకార్ధం వారి కుమారుడు శివగల్ల శ్రీనివాస్ ఇంద్రపాలనగరానికి గత 7 సంవత్సరాల క్రితం అందచేసిన స్వర్గపురి రథం గత రెండు సంవత్సరాలనుండి శిథిలావస్థకు చేరుకోగా, గ్రామ ప్రజల సౌకర్యార్ధం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, వాహన దాత శ్రీనివాస్ చొరవ తీసుకొని సుమారు 1లక్ష 20వేల రూపాయలతో ఆ వాహనాన్ని బాగు చేయించి మళ్ళీ వినియోగంలోకి తీసుకువచ్చారు.ఇంద్రపాలనగరం గ్రామం, పరిసర ప్రాంత ప్రజలు స్వర్గపురి రథం కావలసిన వారు నిర్వహణ ఖర్చులు చెల్లించి ఈ సదుపాయం వినియోగించుకోగలరని గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రం తెలిపారు.

Tags: