జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి

విశ్వంభర, హైదరాబాదు : జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, హైదరాబాదు యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణరావును కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఆరోగ్య భద్రత కల్పించే హెల్త్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రతినిధులు కోరారు. సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం అవసరమని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు బి. జగదీశ్వర్, గండ్ర నవీన్, బి. దామోదర్, హైదరాబాదు యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు క్రాంతి తదితరులు ఉన్నారు.

Tags: