డాక్టర్ నీలం ఇంజెటికి పీహెచ్ డీ

డాక్టర్ నీలం ఇంజెటికి పీహెచ్ డీ

విశ్వంభర, సంగారెడ్డి : ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని నీలం ఇంజెటికి  డాక్టరేట్ వరించింది. ‘ప్రయోగాత్మక జంతువులలో నాడీ సంబంధిత రుగ్మతలకు వ్యతిరేకంగా సంభావ్య మూలికల యొక్క న్యూరోప్రొటెక్టివ్ ప్రభావం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ నీలం సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: