గంజాయి రహిత జిల్లాకు సహకరించాలి  

విశ్వంభర, సిద్దిపేట: గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, గంజాయి రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని టూ టౌన్ సీఐ ఉపేందర్ కోరారు. పట్టణంలోని కేసీఆర్ నగర్ లో కిరాణా, టీ దుకాణాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఉపేందర్ మాట్లాడుతూ సీపీ రష్మీ పెరుమల్ ఆదేశాలతో నార్కోటిక్ డాగ్స్ తో  తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ అమ్మినా సరఫరా చేసినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైన కలిగి ఉంటే వెంటనే డయల్ 100, తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908కు  సమాచారం అందించాలని సూచించారు.

Tags: