అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
- ఆర్డీవో వేణు మాధవరావు
విశ్వంభర,సూర్యాపేట: కొత్త రేషన్ దుకాణాల డీలర్ల కోసం అర్హులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవాలి అని ఆర్డీవో వేణు మాధవరావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేటలో 9 మండలాల్లో ఆత్మకూర్ ఎస్ మండలంలో(2) గట్టికల్లు, శెట్టిగూడెం గ్రామం, చివ్వేంల మండలంలో(2) చందుపట్ల గ్రామం, వాల్య తండా, జాజిరెడ్డిగూడెం మండలంలో(1) కొమ్మాల గ్రామం, మోతే మండలంలో(2) నరసింహపురం తుమ్మ గూడెం గ్రామం, నాగారం మండలంలో(1) వర్ధమానుకోట గ్రామం, నూతనకల్ మండలంలో(1) ఎడవెల్లి గ్రామం, సూర్యాపేట మండలంలో (3)ఇమ్మంపేట గ్రామం, సూర్యాపేట పట్టణం, తాళ్లకాంపాడు గ్రామం, తిరుమలగిరి మండలంలో (2)మాలిపురం, తిరుమలగిరి గ్రామం, తుంగతుర్తి మండలం లో(1) రావులపల్లి గ్రామలలో డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.ఖాళీగా ఉన్న 15 కొత్త రేషన్ దుకాణాలకు రేషన్ డీలర్లు ఈనెల16 నుండి ఏప్రిల్ 14 వరకు పదవ తరగతి పాస్ అయి, తమకుల ధ్రువీకరణ సర్టిఫికెట్, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లందరూ అప్లై చేసుకోవాలని తెలిపారు.



