14న మెగా జాబ్ ఫెయిర్

14న మెగా జాబ్ ఫెయిర్

విశ్వంభర, నారాయణగూడ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నెల 14న నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తు న్నట్లు కేశవ మెమోరియల్ విద్యాసంస్థల డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ ఫెయిర్ గోడపత్రికను గురువారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ మేనేజర్ కార్తిక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బయోటెక్, ఎం.టెక్, పీజీ, నర్సింగ్ చదివిన అభ్యర్థులు జాబ్ ఫెయిర్‌లో పాల్గొనవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి. స్రవంతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీవాణి పాల్గొన్నారు.

Tags: