సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

విశ్వంభర, హైదరాబాదు : అఖిల భారత బీఎంఎస్ అధ్యక్షుడు, ఈపీఎఫ్ఓ సీబీటీ సభ్యుడు సుంకరి మల్లేష్‌ను బీఎంఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చ జరిగింది. సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు కార్పొరేషన్లుగా విభజన జరిగిన నేపథ్యంలో స్టాఫింగ్ ప్యాటర్న్‌ను సరిచేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. అలాగే ఎంప్లాయిస్ ఆప్షన్ తీసుకుని కార్పొరేషన్ వారీగా ఉద్యోగులను బదిలీ చేయాలని సూచించారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం పరిరక్షణకు బీఎంఎస్ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రామ్మోహన్ , జయేందర్, శ్రీధర్, టి. కృష్ణ, రాధాకృష్ణ, బిక్షపతి, నాగమణి, ప్రజ్యుమన్ , వెంకటేష్ పాల్గొన్నారు.

Tags: