విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
విశ్వంభర, నాగారం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నాగారం పోలీసుల ఆధ్వర్యంలో మండల పరిధి వర్ధమానుకోట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల లోపదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఎస్ఐ చిరంజీవి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అందించారు. మాట్లాడుతూ విద్యార్థులు చదువులో చురుకుగా ఉంటూ నిరంతర సాధన చేస్తే లక్ష్యాలను ఆదుపుచ్చుకోవచ్చని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అని అన్నారు. వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల లో ఆత్మవిశ్వాసం ధైర్యం కల్పించారు. లక్ష్యం కోసం నిరంతర సాధన చేయాలని శ్రద్ధతో చదువుకోవాలని సూచించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి మంచి ఫలితాలు సాధించాలని. నిరంతర సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుతారని క్రింది స్థాయిలోనే కష్టపడటం అలవాటైతే పై తరగతులకు పోతే సులభతరం అవుతుందని గుర్తు చేశారు. ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు.



