మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
On
విశ్వంభర, నాగారం: నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు ముదిగొండ లాజర్ మాతృమూర్తి రామలచమ్మ, బీఆర్ఎస్ నాయకుడు సల్ల రమేష్ మామ బత్తుల వెంకన్న ఇటీవల మరణించడంతో గురువారం తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, గుండగాని అంబయ్య, చిల్లర చంద్రమౌళి, దోమలబాలమల్లు, జంపాల రాజు, సతీష్, చిలుకూరి చిరంజీవి, జానీ ప్రసాద్, పంది సుధాకర్, మణికుమార్, సత్తువీరయ్య, పద్మయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



