హరి బౌలి లో ఘనంగా కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు

హరి బౌలి లో ఘనంగా కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు


విశ్వంభర/ హరిబౌలి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకలు చార్మినార్ నియోజకవర్గం లోని హరిబౌలి డివిజన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే హరిబౌలి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అదే ప్రసాదాన్ని సాయంత్రం కవిత గారికి ఇస్తామని, మరియు ఈరోజు ప్రత్యేకంగా విద్యార్థినులకుప్యాడ్స్, అన్నదానం, నూతన ఓటర్ ఐడి కార్డ్స్ ప్రత్యేక డ్రైవ్ 10 రోజులు  ఫ్రీ సర్వీస్ కూడా అందిస్తున్నామని అలాగే  పదవ తరగతి  విద్యార్థినీ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు.హరిబౌలి డివిజన్ కార్యవర్గ సభ్యులు రాకేష్ ( సోను భాయ్ ) తెలిపారు. ఈ కార్యక్రమంలో  హర్ష అస్తానా, శ్రీకర్, రాజు తారకేశ్వరి నేత , తెలంగాణ హ్యూమన్ రైట్స్ చైర్ పర్సన్  శ్రీవాణి చౌదరి,రాజ్ కుమార్, ఓంకార్ స్వామి, నందాల అనిల్ కుమార్, నితిన్, నిలై భూషణ్ రాయ్ అస్థానా, రూప్ సింగ్, సచిన్, శశి, పల్లవి ముఖేష్, రాహుల్ శ్రీకాంత్  తదితరులు పాల్గొని యొక్క కార్యక్రమాలను విజయవంతం చేశారు

Tags: