వివాహ వార్షికోత్సవ వేడుకలు
On
విశ్వంభర, కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ళ కృష్ణారావు, మాలతి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు గోపి రెడ్డి నగర్ లోని రావెళ్ల కృష్ణా రావు నివాసం లో గురువారం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ రావెళ్ళ కృష్ణారావు, మాలతి దంపతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



