క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం 

క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని గాదె రుక్మారెడ్డి  మెమోరియల్ హై స్కూల్  లో ఇంగ్లీష్ ఫెయిర్  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ గట్ల మహేందర్ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ, చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు  క్రమశిక్షణతో కూడిన విద్య సమాజానికి తప్పకుండా  చాలా అవసరమని అన్నారు . విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, రోజు రోజుకి  అంతరించిపోతున్నటువంటి విలువలను కాపాడే బాధ్యత విద్యార్థులపై  ఉందని విద్యార్థులనీ కోరారు . ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ భాషా, ప్రావిణ్యత చాలా అవసరమని గుర్తు చేశారు . కష్టంతో కాకుండా, విద్యార్థులు  చాలా ఇష్టంతో చదివి ఉన్నత మైన  లక్షయాలకి  చేరుకోవాలని, విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని, అనంతరం విద్యార్థులు తమ యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ భవిష్యత్ తరాలకు, బాటలు వేయాలని,  అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రీనా గోపికృష్ణ ,  రజిత మాధవ్ ,  కమ్మగాని కృష్ణమూర్తి , స్కూల్ ఉపాధ్యాయులు హరి ప్రసాద్  , రఘు , ఉపేందర్, స్వామి, కపిలయ్య వీరన్న, యాసిన్ ,అశోక్ , వసీమ , సరోజినీ, శిరీష, సరస్వతి , ఉమామ జ్యోత్స, వెన్నెల ,రేణుక, పూజిత, సుధారాణి, అర్పిత ,ప్రభావతి ,స్వర్ణ, కావ్య ,శ్వేత,  విద్యార్థులు, పాల్గొన్నారు.

Tags: