వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం

వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని పారుపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ సేవా సమితి కమిటీ సభ్యులు గురువారం యాగశాల ప్రవేశం, హోమం, అష్టోత్తర శత కలశాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సేవా సమితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ భూదేవి, నీలాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే 'అష్టోత్తర శత కలశాభిషేకం' అత్యంత వైభవోపేతమైన సేవ అని చెప్పారు. సాధారణంగా తిరుమల, ప్రముఖ వైష్ణవాలయాల్లో ఈ వేడుకను నిర్వహిస్తారన్నారు. ఈ  కార్యక్రమంలో ఆలయ కమిటీ, సేవా సమితి సభ్యులు, ఆలయ మహిళా గోష్టి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags: