విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ 

విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ 

విశ్వంభర, దోమ:  మండల పరిధిలోని దాదాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గ్రామానికి చెందిన బసన్న గౌడ్ తన సొంత ఖర్చుతో ప్యాడ్లు అందజేశారు. పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం వచ్చిన విద్యార్థికి 5000 రూపాయలు రెండవ స్థానం వచ్చిన విద్యార్థికి 2500 రూపాయలు ఇస్తానని బసన్న గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు చిన్నయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: