పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్, పిపిఈ కిట్ల, సబ్బుల పంపిణీ. --మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు

చండూరు సెంటర్లో ఆస్పిరేషనల్ టాయిలెట్ ఏర్పాటు

పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్, పిపిఈ కిట్ల, సబ్బుల పంపిణీ. --మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు

విశ్వంభర,  చండూరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక  కార్యక్రమములో భాగంగా శుక్రవారం నాడు చండూరు పట్టణ ప్రజలకు మరియు అవసరాల నిమిత్తం ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజల సౌకర్యార్దం కొత్త అస్పిరేషనల్ టాయిలెట్ ను మెయిన్ సెంటర్ నందు నిర్మాణముకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తదుపరి పారిశుధ్య సిబ్బంది మరియు ఆఫీస్ సిబ్బందికి స్థానిక గెస్ట్ హౌస్ నందు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది మరియు మున్సిపల్ ఆఫీస్ నందు పారిశుధ్య సిబ్బందికి PPE కిట్లు మరియు సబ్బులు పంపిణి కార్యక్రమములు  మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్  కమీషనర్ ఎల్. మల్లేశం మరియు పాలకవర్గం అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయిబాబా దేవాలయం దగ్గర మరియు బస్టాండ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యచరణలో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని విధిగా నిర్వహిస్తున్నామని, అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.  వివిధ గ్రామాల నుండి వస్తున్న ప్రజల అవసరాల మేరకు చండూరు సెంటర్లో కొత్త ఆస్పిరేషన్ టాయిలెట్లను నిర్మిస్తున్నామని, అదేవిధంగా త్వరలో బస్సు షెల్టర్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులందరూ ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆరోగ్యం కోసమే హెల్త్ క్యాంప్ ను నిర్వహించామని తెలిపారు.ఈ  కార్యక్రమములలో  వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, PHC డా. రాజు, కౌన్సిల్ సభ్యులు శ్రీమతి తేలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాత, జెల్ల ధనమ్మ, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కలిమికొండ పారిజాత, కటకం రమేష్ గార్లు, వార్డు ఆఫీసర్స్ రాములు,సాయి రామ్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ M.అరవింద్ రెడ్డి, ఆశ వర్కర్లు, ANM లు, పారిశుధ్య సిబ్బంది, బిల్ కల్లెక్టర్స్, వాటర్ మెన్స్, ఎలక్ట్రిషియన్స్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
 
 
 
 

Tags: