600 కేజీల బెల్లం సీజ్
విశ్వంభర, హైదరాబాద్ : ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఏ,బీ నాటు సారా బట్టీలపై దాడులు చేపట్టారు. సీ టీమ్ 320 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీములు నిన్న మొన్న వరకు ఎన్‌డీపీఎల్ మద్యం, డ్రగ్స్, గంజాయిపై దృష్టి పెట్టి దాడులు నిర్వహించారు. నాటుసారా ప్రభావం ఉనా.. కల్వకుర్తి, మహబూబబాద్ ప్రాంతాల్లోకి వెళ్లి నాలుసారా తయారీ ప్రాంతాలపై దాడులు నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో బెల్లం రవాణ అవుతుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి పోచమ్మ తాండకు వెళుతున్న బెల్లం ఆటోను పట్టుకున్నారు. ఈకేసులో 600 కేజీలబెల్లం, 50 కేజీల అలంను సీజ్ చేశారు. వీరయ్య, చింటులను అరెస్టు చేశారు.అనంతరం రెడ్డియా తాండ , రాజ్‌పల్లి తండా, కలియాతాండ, ప్రాంతాల్లోనాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. మరో కేసులో ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి హబూబబాద్ జిల్లాలోని మన్నేగూడెం, రవి గూడెం, ముల్కలపల్లి, టెక్కుల తాండ ప్రాంతాల్లో నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించి 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని 900 లీటర్ల బెల్లం పానకాన్ని నేలపాలు చేశారు. ఎస్టీఎఫ్ సీ టీమ్ షేర్‌లింగంపల్లిలో ఎస్‌కె రియాజోద్దీన్ వద్ద 320 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.



