గ్యాస్ కొరతపై కేంద్రం స్పందించాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హైదరాబాదు : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావంతో దేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత నెలకొన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు, గృహ వినియోగ దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి అవసరమైన గ్యాస్ సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాతో పాటు భవిష్యత్తులో ఎరువుల కొరత కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గ్యాస్ కొరత నివారించడంతో పాటు ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ పంపిణీపై స్పష్టమైన విధానాలు రూపొందిం చాలని కేంద్రాన్ని కోరారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.



