దరఖాస్తులను పెండింగ్ పెట్టొద్దు

దరఖాస్తులను పెండింగ్ పెట్టొద్దు

విశ్వంభర, సిద్దిపేట: అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రెవెన్యూ  సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు   అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.  దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి గౌరవం ఇవ్వాలని చెప్పారు. వచ్చిన దరఖాస్తులను సత్వరమే  పరిష్కరించాలని ఆదేశించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు అన్ని రకాల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, సుడా మాజీ ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags: