పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
- ఎం ఈవో రూపారాణి
విశ్వంభర, ఇనుగుర్తి: శనివారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ జంగా రూపారాణి తెలిపారు.బుధవారం ఆమె మాట్లాడుతూ, మండలానికి ఇనుగుర్తి హై స్కూల్ 10వ,తరగతి ఎగ్జామినేషన్ సెంటర్ గా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందన్నారు.ఈసారి 118 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఇనుగుర్తి హై స్కూల్ నుంచి 41 మంది, స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం నుంచి 72 మంది, కోమటిపల్లి హై స్కూల్ నుంచి 5 గురు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయని వివరించారు. ఉ.9:0 నుంచి 12: 30 వరకు నిర్వహించే పరీక్షలకు ఆలస్యం గా రావద్దని, ఉ.8:30 లోగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్స్, పెన్నులు, ప్యాడ్స్ వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా,ఆత్మస్థైర్యంతో రాయాలని ఎంఈఓ రూపా రాణి సూచించారు.పరీక్షల కోసం ఆఫీస్ రూమ్ లో సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ పేపర్స్ ప్యాకింగ్ కట్టలు ఈ గది నుంచే విద్యార్థుల పరీక్ష గదులకు పంపిస్తామని చెప్పారు. ఫర్నిచర్ తో పాటు. ఫ్యాన్లు, లైటింగ్, మంచినీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్లు వివరించారు.



