విద్యార్థుల వ్యవసాయ పరిశోధనా కేంద్ర సందర్శన
విశ్వంభర,కేసముద్రం: విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించేందుకు కేసముద్రం శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ పర్యవేక్షణలో ఆ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు మల్యాలలోని కృషి విజ్ఞాన కేంద్రం (కె వి కె) ఉద్యానవన పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నేల పరీక్ష (సాయిల్ టెస్ట్) ప్రాధాన్యత, రసాయన ఎరువుల వినియోగాన్ని ఎలా తగ్గించాలి, సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా పెంపొందించాలి అనే అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.పర్యటనలో భాగంగా వ్యవసాయ నిపుణులు విద్యార్థులకు పంటల సాగులో నేల ఆరోగ్యం ఎంత ముఖ్యమో వివరించారు. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల పంటల దిగుబడి మెరుగుపడటంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ పర్యటనలో 8వ తరగతి విద్యార్థులతో పాటు మార్గదర్శక ఉపాధ్యాయులు అబ్దుల్ హఫీజ్, సుభాష్ సర్ పాల్గొన్నారు. విద్యార్థులు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నిర్వహిస్తున్న పలు ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించి నిపుణులను ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.



