సిలిండర్ల అక్రమ వినియోగంపై దాడులు

విశ్వంభర, అంబర్‌పేట : గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ అంబర్‌పేట సర్కిల్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 36 డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసులు నమోదు చేశారు. సర్కిల్ పౌరసరఫరాల శాఖ అధికారి దీప్తి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు రెహమాన్ ఖాన్, సావిత్రి, సునీత, సంతోష్, విజయ్ సిబ్బందితో కలిసి రామ్‌నగర్, బాగ్‌లింగంపల్లి, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట ప్రాంతాల్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, టీ స్టాళ్లపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాణిజ్య అవసరాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 17 హెచ్పీసీఎల్, 8 బిపిసీఎల్, 11 ఐఓసీఎల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను అక్షర ఇండెన్ గ్యాస్ ఏజెన్సీలో సురక్షిత కస్టడీకి అప్పగించారు.

Tags: